టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియా.. భారత్ స్క్వాడ్ లో కీలక మార్పులు..!

టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియా.. భారత్ స్క్వాడ్ లో కీలక మార్పులు..!

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా రెండో మ్యాచ్ కి సిద్ధమైంది టీం ఇండియా. పసికూన నమీబియాతో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగింది టీం ఇండియా. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది నమీబియా. ఈ క్రమంలో పసికూన నమీబియాకు ఈ మ్యాచ్ లో ఇండియా భారీ టార్గెట్ పెట్టడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి.

అయితే.. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ మినహా మిగతా వారంతా తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరు వికెట్‌‌‌‌‌‌‌‌ కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో నమీబియాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ వీరులందరూ గాడిలో పడాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోరుకుంటోంది. ఏమాత్రం తేడా వచ్చినా రాబోయే మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నమీబియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను చితక్కొట్టి తొలిసారి మూడొందల మార్క్‌‌‌‌‌‌‌‌ను అందుకోవాలని టీమిండియా ప్రణాళికలు వేస్తోంది. ఇది ఎంతవరకు విజయవంతమవుతోంది చూడాలి. 

అభిషేక్‌‌‌‌‌‌‌‌ ఔట్..

కడుపు ఇన్ఫెక్షన్‌‌‌‌‌‌‌‌ కారణంగా అభిషేక్ ఈ మ్యాచ్ కి దూరమయ్యాడు. అభిషేక్ స్థానంలో సంజు శాంసన్ కు ఓపెనింగ్ స్లాట్ కేటాయించారు. మంగళవారం నెట్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న అతని పరిస్థితి ఢిల్లీ చేరేసరికి మరింత క్షీణించింది. దాంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెండు రోజుల ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తర్వాత బుధవారం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నుంచి డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. అయితే ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సమస్యలతో అతను నమీబియాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కి దూరమయ్యాడు అభిషేక్.

►ALSO READ | ఇదెక్కడి కామెడీ భయ్యా...! ఇండియన్ ప్లేయర్ల బ్యాట్లలో రబ్బర్ ఉంది: శ్రీలంక బ్యాటర్ రాజపక్స కామెంట్స్..

సిరాజ్ స్థానంలో బుమ్రా.. 

స్టార్ పేసర్ బుమ్రా గాయం నుంచి కోలుకొని అందుబాటులోకి రావడంతో సిరాజ్ ను తప్పించి అతనికి స్థానం ఇచ్చారు. బుమ్రా అందుబాటులోకి రావడం ఇండియాకు ప్లస్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ అని చెప్పాలి.

ప్లేయింగ్ XI:

ఇండియా: సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, బుమ్రా, వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి. 

నమీబియా: లారెన్‌‌‌‌‌‌‌‌ స్టీన్‌‌‌‌‌‌‌‌క్యాంప్‌‌‌‌‌‌‌‌, జాన్‌‌‌‌‌‌‌‌ ఫ్రీలింక్‌‌‌‌‌‌‌‌, జాన్‌‌‌‌‌‌‌‌ నికోల్‌‌‌‌‌‌‌‌ లోఫ్టి ఈటన్‌‌‌‌‌‌‌‌, గెరార్డ్‌‌‌‌‌‌‌‌ ఎరాస్మస్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), జేజే స్మిత్‌‌‌‌‌‌‌‌, జాన్‌‌‌‌‌‌‌‌ గ్రీక్‌‌‌‌‌‌‌‌, డైలాన్‌‌‌‌‌‌‌‌ లీచెర్‌‌‌‌‌‌‌‌, విలియమ్‌‌‌‌‌‌‌‌ మైబర్గ్‌‌‌‌‌‌‌‌ , రూబెన్‌‌‌‌‌‌‌‌ ట్రూపెల్మ్‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌, బెర్నార్డ్‌‌‌‌‌‌‌‌ స్కూల్జ్‌‌‌‌‌‌‌‌, బెన్‌‌‌‌‌‌‌‌ షికాంగో.