ఇదెక్కడి కామెడీ భయ్యా...! ఇండియన్ ప్లేయర్ల బ్యాట్లలో రబ్బర్ ఉంది: శ్రీలంక బ్యాటర్ రాజపక్స కామెంట్స్..

ఇదెక్కడి కామెడీ భయ్యా...! ఇండియన్ ప్లేయర్ల బ్యాట్లలో రబ్బర్ ఉంది: శ్రీలంక బ్యాటర్ రాజపక్స కామెంట్స్..

శ్రీలంక బ్యాటర్ రాజపక్స ఇండియన్ ప్లేయర్స్ వాడే బ్యాట్లపై సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ ప్లేయర్స్ స్పెషల్ బ్యాట్స్ వాడుతున్నారని.. వారు వాడే బ్యాట్లలో అదనంగా రబ్బరు ఉంటుందని.. అందుకే వారు భయంకరంగా ఆడుతున్నారని అన్నారు. రాజపక్స కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. టీ 20 వరల్డ్ కప్ ఐర్లాండ్ పై శ్రీలంక 20 రన్ల తేడాతో గెలుపొందిన క్రమంలో రాజపక్స ఈ కామెంట్స్ చేశారు. 

కొంతమంది ఇండియన్ బ్యాటర్స్ పవర్ ఫుల్ పర్ఫామెన్స్ చూస్తే... ఈ డౌట్ వస్తుందని, అది కేవలం బ్యాటింగ్ స్కిల్ మాత్రమే కాదని.. వారు వాడే బ్యాట్లలో ఎదో స్పెషల్ ఎక్విప్మెంట్ ఉందని అన్నారు. రాజపక్స కామెంట్స్ పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.. అతని ఆరోపణలు చూస్తుంటే.. చిన్నప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్స్ బ్యాట్లలో స్ప్రింగులు పెట్టుకొని ఆడుతున్నారంటూ చేసిన కామెంట్స్ గుర్తొస్తున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. రాజపక్స కామెంట్స్ గల్లీ క్రికెట్ స్థాయిలో ఉన్నాయంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

బ్యాట్ స్టాండర్డ్స్ పై ఐసీసీ రూల్స్ ఇలా ఉన్నాయి:

బ్యాట్లను చెక్కతో మాత్రమే తయారు చేయాలని..సైజు, థిక్నెస్ విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది ఐసీసీ.
ఇంటర్నేషనల్ మ్యాచ్ లు జరిగే సమయంలో బ్యాట్ల క్వాలిటీ విషయంలో ఐసీసీ ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇండియన్ ప్లేయర్స్ వాడే బ్యాట్లు తాము వాడే బ్యాట్ల కంటే మెరుగ్గా ఉంటాయని.. వాటిపై రబ్బర్ లేయర్ ఉన్నట్లు ఉంటుందని అన్నారు రాజపక్స. ఇతరులు ఇండియన్ ప్లేయర్స్ వాడే బ్యాట్లు కొనలేరని కూడా చెప్పుకొచ్చారు రాజపక్స. అయితే.. ప్రొఫెషనల్ క్రికెటర్స్ అందరూ ప్లేయర్ ఎడిషన్ బ్యాట్లను మాత్రమే వాడతారు. సాధారణంగా అవి రిటైల్ ఔట్లెట్లలో లభించవు.

►ALSO READ | T20 World Cup: నమీబియా బ్యాటర్లకు చుక్కలే: బుమ్రా రెండో మ్యాచ్ ఆడటం కన్ఫామ్..!

ప్రొఫెషనల్ క్రికెటర్స్ వాడే బ్యాట్లు ప్లేయర్ స్పెసిఫికేషన్ల ప్రకారం బ్యాట్లు తయారు చేయించుకుంటారు. అంటే.. ప్లేయర్ యొక్క స్వింగ్, స్ట్రెంత్, టైమింగ్ ని బట్టి బ్యాట్ తయారు చేయించుకుంటారు. రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ పికప్ అండ్ కంట్రోల్ ని డక్బిల్ ప్రొఫైల్ ను లైక్ చేస్తారని అంటుంటారు. రోహిత్ బ్యాట్ 'మిడ్ టు లో స్వెల్ డిజైన్' లో ఉంటుంది, అయితే కోహ్లీ బ్యాట్ హై థిక్ స్పైన్ డిజైన్ లో ఉంటుంది.

బ్యాట్లపై బ్రాండింగ్స్:

మన ప్లేయర్స్ వాడే బ్యాట్లపై SG, SS, MRF, CEAT వంటి బ్రాండ్ల లోగోలు ఉంటాయి.. అయితే.. లోగోలు ఉన్నంత మాత్రాన స్పాన్సరింగ్ కంపెనీలు బ్యాట్ తాయారు చేయాలని రూల్ లేదు.

SG, SS, BDM, BAS వంటి ప్రత్యేక తయారీదారులు బ్యాట్ల తయారీలో ఉన్నప్పటికీ, ఐసీసీరూల్స్ ప్రకారం రిజిస్టర్డ్ స్పాన్సర్‌లు వారు మార్కెట్ చేసే బ్యాట్‌లపై వారి లోగోలను వేసుకోవచ్చు.