మహేశ్వరంలో హైటెన్షన్: అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు.. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత!

మహేశ్వరంలో హైటెన్షన్: అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు.. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత!

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అనుమతి లేదని పోలీసులు తొలగించడం తీవ్రఉద్రిక్తతకు దారితీసింది. అంబేద్కర్ విగ్రహం పక్కనే అర్ధ రాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారని, దాన్ని మరోచోట ఏర్పాటు చేయాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శివాజీ విగ్రహం కూడలి వద్దే ఉండాలని బీజేపీ నాయకులు పట్టుబట్టాయి. ఇరు వర్గాలు ఆందోళన చేయడంతో పోలీసులు సముదాయించి శివాజీ విగ్రహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేశారు.

►ALSO READ | "అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేశాం.. ఇప్పుడు పోరాటం తప్ప వేరే దారి లేదు": మాజీ ఎమ్మెల్సీ కవిత ఆవేదన