"అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేశాం.. ఇప్పుడు పోరాటం తప్ప వేరే దారి లేదు": మాజీ ఎమ్మెల్సీ కవిత ఆవేదన

"అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేశాం.. ఇప్పుడు పోరాటం తప్ప వేరే దారి లేదు": మాజీ ఎమ్మెల్సీ కవిత ఆవేదన

హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన ఆరేండ్ల తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టారని మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 1995లో వరంగల్ డిక్లరేషన్ తో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైందని ఆమె చెప్పారు. స్వరాష్ట్ర ఉద్యమంలో మారోజు వీరన్న, గద్దర్ లాంటి వారు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత మాట్లాడారు. ఈ తెలంగాణ గడ్డపై విరామం లేకుండా ఒకదాని తర్వాత మరొక ఉద్యమం కొనసాగుతూనే వచ్చిందన్నారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టారని, నిప్పుకణికలా మండుతున్న ఉద్యమాన్ని అగ్గిరాజేసిండని అన్నారు. 2014లో తెలంగాణ తెచ్చుకున్నంక ఉద్యమకారులకు దక్కుతదని అనుకున్నమో వారికి న్యాయం జరగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఎక్కడైనా ఉద్యమకారులకు పదవులు దక్కితే వారు మిగతా వారిని పురుగులను చూసినట్లు చూశారని విమర్శించారు.

 'తెలగాణ ఉద్యమ సమయంలో మనను కొట్టించారో వారు సార్ పక్కనే చేరిండ్రు..  కేశవరావు జాదవ్ చనిపోతే ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయా..? జయశంకర్ బొమ్మ కేబీఆర్ పార్కు వద్ద పెట్టాలని నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను పదే పదే అడిగిన.. సుప్రీంకోర్టు తీర్పు అడ్డొచ్చింది.. ట్యాంకు బండ్ మీద పెడతామన్న పెట్టుకోలేక పోయినం.. అక్కడున్న ఆంధ్రోళ్ల విగ్రహాలు తీస్తరని అనుకున్నం... తీయకపోతివి.. కనీసం మనోళ్ల విగ్రహాలైన పేట్టకపోతివి.. ఆ బాధ వెంటాడుతూనే ఉన్నది. ఇప్పుడొచ్చినైన ఎవరి బొమ్మలు పెడుతుండో అర్థం కాని పరిస్థితి ఉంది. ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నం.. ఆయనకు ఏం సోయి ఉంటది తెలంగాణ అంటే. రవీంద్ర భారతిలో గద్దర్, బిరదరాజు రామరాజు, సుద్దాల విగ్రహాలు ఉండాల్సింది... ఎవరి విగ్రహాలున్నాయి. చేతులో ఉన్నప్పుడు చేసుకోలేదు. ఇప్పుడు మన చేతులో పోరాటం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు పోరాడితేనే ఉద్యమ కారులకు న్యాయం జరుగుతుంది.' అని కవిత అన్నారు.

ప్రైవేటు కొలువుల్లో 20% రిజర్వేషన్లు
తెలంగాణలోని ప్రైవేట్ సంస్థల్లో స్తానికులకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలంగాణ జాగృతి పోరాడుతుందని చెప్పారు. వందల, వేల సంఖ్యలో ఉద్యమకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారని, ఇందుకోసం యాప్ లాంచ్ చేశామని అందులో వివరాలు నమోదు చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాబోయే బడ్జెట్లో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. చేయకుంటే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డిని కాదు ప్రొఫెసర్ కోదండరామ్ ను హెచ్చరిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డిని నమ్మింది. కోదండరామ్ వల్లేనేనన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమ వ్యతిరేకి అయినప్పటికీ కోదండరామ్ ఆయన పక్కన చేరాడు కాబట్టి ఏమైనా మనకు పని చేస్తాడని ఉద్యమకారులు భావించారన్నారు.

►ALSO READ | హైదరాబాద్ లో మొబైల్ అంగన్ వాడీలు.. 274 స్లమ్ ఏరియాల్లో ఇంటి దగ్గరికే సేవలు..