హైదరాబాద్ లో మొబైల్ అంగన్ వాడీలు.. 274 స్లమ్ ఏరియాల్లో ఇంటి దగ్గరికే సేవలు..

హైదరాబాద్ లో మొబైల్ అంగన్ వాడీలు.. 274 స్లమ్ ఏరియాల్లో ఇంటి దగ్గరికే సేవలు..
  • పౌష్టికాహారం అందించేందుకు 37 వాహనాలు
  • మహిళా, శిశు సంక్షేమశాఖ కసరత్తు

గ్రామీణ ప్రాంతాల నుంచివలసొచ్చి.. స్లమ్ ఏరియాలు, బస్తీల్లో నివాసం ఉంటున్న వారికి శుభవార్త చెప్పేందుకు ప్రభు త్వం సిద్ధమవుతోంది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు మొబైల్ అంగన్ వాడీలను ప్రారంభించనుంది. ఇందుకోసం 37 వాహనాలను హైర్ చేసుకోనుంది. వాటి ద్వారా 274 స్లమ్ ఏరియాలను కవర్ చేస్తూ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవు తోంది. 

భవనాల కొరత, సాంకేతిక సమస్యలు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు దిశగా తెలంగాణ మహిళా శిశుసంక్షేమ శాఖ కసరత్తు లు ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 2,364 అంగన్వాడీ కేంద్రాలు కొన సాగుతున్నాయి. 

అయితే శాఖ నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో హెచ్ఎండీఏ పరిధిలోని 274 కవర్ కాని బస్తీల్లో 25,310 మంది అర్హు లైన చిన్నారులు, గర్భిణీలు, బాలింతలను గుర్తిం చారు. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో వీరికి పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదని వెల్లడైంది. 

దీంతో అర్హులందరి కీ అంగన్వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. టేక్ హోం రేషన్ విధానంలో అర్హుల నివాసాల కేసరుకులు అందించే విధంగా చర్యలు తీసు కుంటున్నారు. ఇందులో బాలమృతం, పాలు, స్నాక్స్, కోడి గుడ్లు, బియ్యం తదితర పోషకా హార పదార్థాలను పంపిణీ చేయనున్నారు.

అంగన్ వాడీలకు అనుబంధం

ఇందులో భాగంగా 274 ప్లమ్ ప్రాంతాలను కవర్ చేస్తూ 37 వాహనాలను అద్దెకు తీసుకుని మోబైల్ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.60,000 అద్ది చెల్లించనున్నారు. జిల్లా వారీగా హైదరాబాద్ లో 7, మేడ్చెల్-మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మోబైల్ కేంద్రాలను సమీప అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు. 

మోబైల్ అంగన్ వాడీ వాహనాల ద్వారా ఆయా ప్రాంతాల్లోని అర్హులకు పోషకాహారాన్ని అందచేయనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు సంవత్సరానికి సుమారు రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు మంత్రి సీతక్క తెలిపారు.