ఆలౌట్ అవ్వకుండా పరువు నిలబెట్టుకున్న టీం ఇండియా.. పసికూన టార్గెట్ 210

ఆలౌట్ అవ్వకుండా పరువు నిలబెట్టుకున్న టీం ఇండియా.. పసికూన టార్గెట్ 210

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో తలపడుతుంది టీం ఇండియా. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీలు మినహా బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. 20 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయిన టీం ఇండియా 209 రన్స్ చేసి... ఆలౌట్ అవ్వకుండా పరువు కాపాడుకుంది. ఈ క్రమంలో పసికూన నమీబియా ముందు 210 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది టీం ఇండియా.

ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా బరిలో దిగిన ఇషాన్ 24 బంతుల్లో 61 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు. 5వ వికెట్ గా బరిలో దిగిన హార్దిక్ పాండ్య 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 52 రన్స్ సాధించాడు. 

హార్దిక్ హాఫ్ సెంచరీ చేయడంతో టీం ఇండియా స్కోర్ 200 దాటింది.ఎరాస్మస్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు హార్దిక్ పాండ్య. ప్రస్తుతం మరి, పసికూన ముందు భారీ టార్గెట్ ఉంచిన టీం ఇండియా బౌలింగ్ తో ఆకట్టుకొని విజయ పరంపర కొనసాగిస్తుందో లేదో చూడాలి.