Krithi Shetty: నేచురల్ లుక్‌లో బేబమ్మ మెరుపులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్.

Krithi Shetty: నేచురల్ లుక్‌లో బేబమ్మ మెరుపులు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ పిక్స్.

టాలీవుడ్ 'ఉప్పెన' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ కృతి శెట్టి. తన అమాయకపు చూపులు, ఆకట్టుకునే నటనతో మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో 'బేబమ్మ'గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో ఒకప్పుడు టాలీవుడ్‌కు లక్కీ చార్మ్‌గా నిలిచింది. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ తన ఫోటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. 

నేచురల్ లుక్ లో మెరిసిపోతున్న ఈ అమ్మడి పిక్స్ చూసి అభిమానులను ఫిదా అవుతున్నారు. ఇటుక గోడ బ్యాక్ డ్రాప్ లో, సాయంత్రపు గోల్డెన్ అవర్ వెలుతురులో తీసిన ఈ ఫోటోలో ఆమె సింపుల్, నేచురల్ లుక్ లో కనిపించింది. పసుపు రంగు ఓపెన్ నిట్ స్వెటర్, నల్ల లెగ్గింగ్స్ తో నేలపై కూర్చుని నవ్వుతూ కనిపించిన కృతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 2003 సెప్టెంబర్ 21న జన్మించిన కృతి శెట్టి.. 17 ఏళ్ల వయసులోనే 'ఉప్పెన' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు కూడా దక్కింది. తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం', 'కస్టడీ', 'మనమే', 'ఏఆర్ఎం' వంటి సినిమాల్లో నటించింది.
 
ప్రస్తుతం కృతి పాన్ ఇండియా, ముల్టీలాంగ్వేజ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. తమిళంలో కార్తితో 'వా వాతియార్', ప్రదీప్ రంగనాథన్ తో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', రవి మోహన్ జీనీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా 2026లో విడుదలయ్యే అవకాశముంది. హిందీలో టైగర్ శ్రాఫ్ తో కలిసి ఓ యాక్షన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతే కాదు  తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కృతి ఛాన్స్ కొట్టేసిందంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతోంది.