ప్రపంచంలో ఏ దేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతమైనదో తెలిపే 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్' 2026 రిపోర్ట్ విడుదలైంది. ఇందులో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ గొప్పగా పెరిగింది. గతేడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి 75వ స్థానానికి చేరుకుంది. అంటే ఒకే ఏడాదిలో 10 స్థానాలు ఎగబాకింది.
ఎన్ని దేశాలకు వెళ్లొచ్చు:
ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా లేకుండానే (Visa-free) లేదా అక్కడికి వెళ్ళాక తీసుకునే వీసా (Visa-on-arrival) సౌకర్యంతో ప్రయాణించవచ్చు. దాదాపు 17 ఏళ్ల క్రితం (2008-09లో) భారత్ ఇదే ర్యాంకుల్లో ఉండేది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ స్థాయికి చేరుకోవడం విశేషం.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల లిస్టులో ఆసియా దేశాలే హవా కొనసాగిస్తున్నాయి. సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా... జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా టాప్ ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ దేశాల పౌరులు 185 కంటే ఎక్కువ దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఒకప్పుడు టాప్‌లో ఉన్న అమెరికా ప్రస్తుతం 10వ స్థానానికి పడిపోయింది.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అంటే ఏమిటి?
ఏ దేశ పాస్‌పోర్ట్ ద్వారా ఎన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చో లెక్కించి ఈ ర్యాంకులను ఇస్తారు. దీనికోసం అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ (IATA) ఇచ్చే అధికారిక సమాచారాన్ని తీసుకుంటారు.
