మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్లు.. గురువారం స్థిరంగా వెండి.. హైదరాబాద్ రేట్లు ఇవే..

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్లు.. గురువారం స్థిరంగా వెండి.. హైదరాబాద్ రేట్లు ఇవే..

ఈవారం బంగారం, వెండి రేట్లు కొద్దికొద్దిగా తగ్గుతూ నిలకడగా ముందుకు సాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావటంతో షాపింగ్ చేయాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రస్తుతం ఇదొక సదవకాశంగా మారింది. దీనికి తోడు వెండి రేట్లు కూడా దాదాపుగా మూడు రోజుల నుంచి ఎలాంటి మార్పు లేకుండా కొనసాగటం ఊరటను ఇస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని భావిస్తున్న వాళ్లు ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలించి కొనుగోలు చేయండి. 

ఫిబ్రవరి 12న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ఫిబ్రవరి 11 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.120 తగ్గింపును నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా పెరిగి రూ.15వేల 840గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 520గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.

ALSO READ : ఓటీపీ మోసాల నుంచి రక్షణకు..ఎయిర్టెల్ నుంచి ఫ్రాడ్ అలర్ట్ మెసేజ్లు

అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఫిబ్రవరి 12, 2025న వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.