ఓటీపీ మోసాల నుంచి రక్షణకు..ఎయిర్టెల్ నుంచి ఫ్రాడ్ అలర్ట్ మెసేజ్లు

ఓటీపీ మోసాల నుంచి రక్షణకు..ఎయిర్టెల్ నుంచి ఫ్రాడ్ అలర్ట్ మెసేజ్లు

హైదరాబాద్​, వెలుగు: ఓటీపీ, బ్యాంకింగ్ మోసాల నుంచి కస్టమర్లను రక్షించడానికి ఎయిర్​టెల్​ ఏఐ ఆధారిత ఫ్రాడ్ అలర్ట్ సదుపాయాన్ని ప్రారంభించింది. డెలివరీ లేదా ఇతర సేవల పేరుతో మోసగాళ్లు కస్టమర్ల నుంచి ఓటీపీలను సేకరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

కస్టమర్​ ఫోన్లో మాట్లాడున్నప్పుడు, బ్యాంకింగ్ ఓటీపీని ఇచ్చే ప్రమాదం ఉందని గుర్తిస్తే ఈ వ్యవస్థ అలర్ట్​ మెసేజ్​ పంపుతుంది. తద్వారా వినియోగదారులు జాగ్రత్త పడేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఈ సేవలు హర్యానాలో అందుబాటులో ఉన్నాయని, వచ్చే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా అందరికీ  అందుబాటులోకి రానున్నాయని ఎయిర్​టెల్​  తెలిపింది.