వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీనపడటం సహజం. కానీ ప్రతిరోజు తప్పకుండా బరువులు ఎత్తడం వల్ల మీ మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా, మెదడు వయస్సు కూడా తగ్గుతుందని 2026 కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మీ కండరాలకు పని చెప్పే వ్యాయామాలనే రెసిస్టెన్స్ వ్యాయామాలు అంటారు. దీనికోసం జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే బరువైన వస్తువులను ఎత్తిన చాలు.
అధ్యయనంలో తేలిన ఆసక్తికర విషయాలు :
*బరువులు ఎత్తే వ్యాయామాలు చేసే వృద్ధుల మెదడు, ఏ వ్యాయామం చేయని వారి కంటే దాదాపు 2.3 ఏళ్లు తక్కువగా, చురుగ్గా కనిపిస్తున్నట్లు న్యూరో ఇమేజింగ్ పరీక్షల్లో తేలింది. ఈ వ్యాయామాలు మెదడులోని వివిధ భాగాల మధ్య సంబంధాన్ని పెంచుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతాయి. సాధారణ లేదా అధిక బరువుతో శిక్షణ పొందడం వల్ల మెదడు ముసలిబారిపోకుండా, యవ్వనంగా ఉన్నవారి మెదడులా పనిచేస్తుంది. ఇలా కేవలం అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉన్న పెద్దలు కూడా రోజు తప్పకుండా చేస్తే వారి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
►ALSO READ | Good Health : వీటి తొక్క తీశారా.. శక్తిని కోల్పోతారు..!
శారీరక బలం కోసం మాత్రమే కాకుండా, మానసిక ఉల్లాసం కోసం ఇంకా వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి వారానికి కనీసం రెండు మూడు సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం చాలా మంచిది.
