దాదాపు రెండు వారాలుగా తగ్గకుండా పెరుగుతున్న బంగారం, వెండి రేట్ల నుంచి కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. న్యూఇయర్, సంక్రాంతి షాపింగ్ చేస్తున్న వారికి ఈ సమయంలో తగ్గింపు పెద్ద గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా తగ్గిన రేట్లను గమనించి షాపింగ్ నిర్ణయం తీసుకోవటం మంచిది.
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 29, 2025న బంగారం రేట్లు తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో డిసెంబర్ 28 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.71 తగ్గింది. తాజా తగ్గింపుతో తర్వాత హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 171గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 990గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాతనే శాట్‌కామ్ సర్వీస్‌లు..
ఇక వెండి కూడా డిసెంబర్ నెలలో దూకుడును అస్సలు బ్రేక్ లేకుండా కొనసాగిస్తోంది. ముఖ్యంగా డిమాండ్ కి తగిన స్థాయిలో సరఫరా లేకపోవటంతో సిల్వర్ రేట్ల ర్యాలీ ఆగకుండా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం డిసెంబర్ 29, 2025న వెండి రేటు కేజీకి రూ.4వేలు తగ్గుదలను నమోదు చేసి కొనుగోలుదారులకు పెద్ద ఊరటను అందిస్తున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 81వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.281 వద్ద ఉంది.
