హైదరాబాద్: మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం 'డ్రైవర్ ఉద్యోగ మేళా'ను నిర్వహించనుంది. హైదరాబాద్ మహిళలకు బైక్ టాక్సీ, ఈఆటో డ్రైవింగులో శిక్షణ ఇవ్వనుంది. ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ జారీలో సహాయంగా ఉంటుంది.
వాహన లోన్/ లీజు సౌకర్యం & ఉపాధి కల్పిస్తుంది. డ్రైవింగ్ అనుభవం లేకున్నా అప్లై చేయొచ్చు. ఏజ్ 21-45 ఏండ్ల మధ్య (హైదరాబాద్వాసులే) ఉండాలి. ఔత్సాహికు లు జనవరి 3న అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు వెళ్లాలి. మరిన్ని 89788 62299 సంప్రదించండి. ఆసక్తి గల మహిళలు ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు 'అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
►ALSO READ | అధ్యక్షా ఐదు రోజులే.!కృష్ణా జలాలే లక్ష్యంగా అసెంబ్లీ
