జనగామాలో ఉత్కంఠ..స్వతంత్ర అభ్యర్థుల కోసం బాహాబాహీ

జనగామాలో ఉత్కంఠ..స్వతంత్ర అభ్యర్థుల కోసం బాహాబాహీ

జనగామా మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ దగ్గర కాంగ్రెస్ , బీఆర్ ఎష్ నేతలు బాహాబాహీకి దిగారు. జనగామ మున్సిపాలిటీలో  మొత్తం 30 వార్డులుండగా.. బీఆర్ ఎస్  13 వార్డులు, కాంగ్రెస్ 12 వార్డులు, సీపీఎం 1 వార్డు, స్వతంత్రులు 4 వార్డులను గెలుచుకున్నారు. 

ప్రధాన పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే స్వతంత్రులు  కీలకమయ్యారు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ ఎస్ లు స్వతంత్ర అభ్యర్థులను తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు. మావాళ్లు అంటే మావాళ్లన  వారిని తీసుకెళ్లేందుకు గొడవకు దిగారు. దీంతో  కౌంటింగ్ కేంద్ర దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు  కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలను చెదరగొట్టారు.