గచ్చిబౌలిలో పట్టపగలే భారీ నగదు చోరీ.... ATM వెహికల్ లో రూ. 57 లక్షలతో డ్రైవర్ పరార్..

గచ్చిబౌలిలో పట్టపగలే భారీ నగదు చోరీ.... ATM వెహికల్ లో రూ. 57 లక్షలతో డ్రైవర్ పరార్..

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లిలో ATM వెహికల్ లో రూ. 57 లక్షల నగదుతో పరార్ అయ్యాడు డ్రైవర్. గురువారం ( ఫిబ్రవరి 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ని గోపనపల్లిలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలలో నగదు నింపేందుకు వచ్చిన సిఎంఎస్ వాహనాన్ని డ్రైవర్ అజిత్ (అలియాస్ శివ) రూ. 57 లక్షల నగదుతో సహా తీసుకుని పరారయ్యాడు.

​ఇద్దరు కస్టోడియన్లు బ్యాంక్ లోపల నగదు నింపే పనిలో ఉండగా.. సెక్యూరిటీ గార్డు వాష్‌రూమ్‌కు వెళ్లాడని.. అదే సమయంలో డ్రైవర్ అజిత్ వాహనాన్ని తీసుకుని ఉడాయించాడని తెలిపారు పోలీసులు. నిందితుడు వాహనాన్ని తెల్లాపూర్ సమీపంలో వదిలివేసి, లోపల ఉన్న సుమారు రూ. 57 లక్షల నగదుతో పరారయ్యాడని తెలిపారు పోలీసులు.

ఈ ఘటనపై ​కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు గచ్చిబౌలి పోలీసులు.నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు పోలీసులు.