మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్..ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు

మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్..ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు

కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ ఒక్క ఓటుతో  విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 259 , బీఆర్ ఎస్ అభ్యర్థి తాహిర్ కు 258 ఓట్లు పడ్డాయి. మొదటిసారి  ఓట్ల లెక్కింపు రెండు ఓట్లు మెజార్టీ రావడంతో రీకౌంటింగ్ చేయగా ఒక్క ఓటుతోకాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 

మరోవైపు పరకాలలోనూ  కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.  పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొచ్చు సుభద్ర- సాల్మన్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శనిగరపు రజిని -నవీన్ లపై ఒక్క ఓటుతో గెలుపొందారు. 

17వ వార్డులో మొత్తం 836 ఓటర్లు ఉండగా కాంగ్రెస్ అభ్యర్థికి 369 రాగా సమీప బీఆర్ఎస్ అభ్యర్థికి 368 వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడా రావడంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ పెట్టారు. రెండో సారి కౌంటింగ్ లో  కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర -సాల్మన్ గెలుపును ప్రకటించారు.