బీహార్ ఉప ఎన్నిక : బంకిపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ ముందంజ..!

బీహార్ ఉప ఎన్నిక : బంకిపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ ముందంజ..!

బీహార్ రాష్ట్రంలోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఈ నియోజకవర్గం నుంచి జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బరిలో ఉండగా.. బీజేపీ, ఆర్జేడీ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. జూలై 31వ తేదీన పోలింగ్ జరిగింది. 

2026, ఆగస్ట్ 3వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మోదటి రౌండ్ ఫలితాలు ప్రకటించారు అధికారులు. ఎవరూ ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కు 2 వేల 220 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు వెయ్యి 423 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

బ్యాలెట్ ఓట్లు, EVM ఫస్ట్ రౌండ్ పూర్తయ్యే సమయానికి జన సూరజ్ పార్టీ అభ్యర్థి, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ 862 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

బంకిపూర్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. గత బీహార్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు ప్రశాంత్ కిషోర్ పార్టీ. ఈ క్రమంలోనే పార్టీ పని అయిపోయిందనే ప్రచారం జరిగింది. ఏడాదిలోనే బంకిపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావటంతో.. ప్రశాంత్ కిషోర్ స్వయంగా బరిలోకి దిగారు. ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీజేపీ, ఆర్జేడీ పార్టీలే నువ్వూనేనా అన్నట్లు పోటీపడేవి. ఫస్ట్ టైం మూడో పార్టీ.. జేఎస్పీ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. 

మొత్తం 31 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఇప్పుడు ఒక్క రౌండ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది.