హైదరాబాద్ సరస్ మేళాలో 10 మెప్మా స్టాల్స్

 హైదరాబాద్ సరస్ మేళాలో 10 మెప్మా స్టాల్స్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్​ 7 నుంచి  18 వరకు హైదరాబాద్​లో నిర్వహించే సరస్​ మేళా 2026లో మెప్మాకు పది స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం దక్కినట్లు మెప్మా ఎండీ దివ్య దేవరాజన్​ గురువారం తెలిపారు. వీటితో పాటు ఒకటి లైవ్​ ఫుడ్​ స్టాల్​ ఏర్పాటుకు చాన్స్​ దక్కినట్లు చెప్పారు. క్యూర్​ పరిధిలోని గ్రేటర్​ హైదరాబాద్​, సైబరాబాద్​, మల్కాజ్​గిరికి చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెప్మా పరిధిలో ఎస్​హెచ్​జీల నుంచి ఎంపిక చేయబడిన మహిళలు అక్టోబర్​ 6వ తేదీ సాయంత్రంలోగా అంబేడ్కర్​ విగ్రహం ప్రక్కన ఉన్న హెచ్​ఎండీఏ గ్రౌండ్స్ కు చేరుకొని రిజిస్ట్రేషన్​ కమిటీకి రిపోర్ట్​ చేయవలని ఉంటుందన్నారు. 

తమకు కావలసిన వంట సామాగ్రి, మెనూ వివరాలను అక్టోబర్​ 2 లోపు తెలియజేయాలని, గ్యాస్ సిలిండర్, ఇతర సామాగ్రి అద్దె ప్రాతిపదికన ఇక్కడ అందచేస్తారని తెలిపారు. అర్హులైన మహిళా పారిశ్రామికవేత్తల వివరాలను నిర్ణీత ఫార్మాట్ లో పూర్తి చేసి ఈ నెల 20వ తేదీలోపు పంపించాలని మెప్మా ప్రాజెక్ట్​ డైరెక్టర్లను, జీహెచ్‌‌ఎంసీ, ఎమ్ఎమ్‌‌సీ, సీఎమ్‌‌సీ అడిషనల్ కమిషనర్లను మెప్మా ఎండీ దివ్య దేవరాజన్​ ఆదేశించారు.