న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం 'తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం' ఘనంగా జరిగింది. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయెల్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం జాతీయజెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ కమిషనర్ తో పాటు స్పెషల్ సెక్రటరీ (కో–ఆర్డినేషన్) అద్వైత్ కుమార్ సింగ్, తెలంగాణ భవన్ అధికారులు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
