హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం సెక్రటేరియేట్‌లో సీఎస్ సంజయ్ జాజుతో పాటు జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం వినతిపత్రం అందజేసింది.
రాష్ట్రంలోని సుమారు 2.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, టీచర్ల ఆకాంక్షను తక్షణమే నెరవేర్చాలని కోరారు. రిటైర్ అయిన ఉద్యోగులకు నెలకు కేవలం రూ.1,500 నుంచి రూ.2,500 మాత్రమే పెన్షన్ వస్తోందన్నారు.
