- చెరువులు, కుంటల వద్ద బారికేడ్స్, లైఫ్ గార్డులను ప్రభుత్వం నియమించాలి
- వీహెచ్‌పీ నేత బాలస్వామి
హైదరాబాద్ సిటీ, వెలుగు: వినాయక నిమజ్జన ఉత్సవాల్లో స్వీయ నియంత్రణ, అప్రమత్తత ఎంతో అవసరమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగడాకుల బాలస్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పెద్ద కంజర్ల నేరేడు చెరువులో మునిగి ఆరుగురు స్టూడెంట్స్ మృతి చెందడం బాధాకరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చెరువులు, కుంటల వద్ద బ్యారికేడ్స్, లైఫ్‌గార్డులు, అత్యవసర వైద్య సదుపాయాలతో భద్రతను పటిష్టం చేయాలని కోరారు. గణేశ్ మండపాల నిర్వాహకులు, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి చిన్నారులు చెరువుల్లో లోతు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలన్నారు.డీజేలు, వాహనాలపై ప్రమాదకర ప్రయాణాలను నివారిస్తూ.. అందరి సమన్వయంతో ‘ప్రాణ నష్టం లేని వినాయక నిమజ్జనం’ విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
