బీఆర్ఎస్ కాదు.. భూ చోర్ రాష్ట్ర సమితి : విప్ అద్దంకి దయాకర్

బీఆర్ఎస్ కాదు.. భూ చోర్ రాష్ట్ర సమితి : విప్ అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ను ఇకనుంచి ‘భూ చోర్ రాష్ట్ర సమితి’ అని పిలుస్తామని విప్ అద్దంకి దయాకర్ అన్నారు. గురువారం సీఎల్పీలో విప్ బల్మూరి వెంకట్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను నెల రోజులు పొడిగిస్తే వచ్చి గల్లా పడుతానని కేటీఆర్ అంటున్నాడని, నెల కాదు, రెండు నెలలు సభను పొడగించేందుకు తాము సిద్ధమన్నారు. కానీ సభకు కేసీఆర్ వస్తాడా.. వస్తే స్పీకర్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీకి వస్తే సీఎం రేవంత్ రెడ్డి తమ బండారాన్ని బయటపెడుతాడనే భయంతోనే బీఆర్ఎస్ బయట డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. 

బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం భూస్వాముల కుటుంబమే అయితే ఆయన గతంలో దొంగ పాస్‌‌‌‌‌‌‌‌పోర్టుల దందాను ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని కేటీఆర్​కు సవాల్​ విసిరారు. కేసీఆర్ కు ‘దుబాయ్ శేఖర్’ అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌‌‌‌‌‌‌‌ భూములపై సర్వే చేస్తే కల్వకుంట్ల కుటుంబ భూ దోపిడీ తెలంగాణ ప్రజలకు తెలుస్తుందన్నారు.