అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ మృతి.. తీవ్ర గాయాలతో వెంటిలేటర్పై భర్త

అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ మృతి.. తీవ్ర గాయాలతో వెంటిలేటర్పై భర్త

నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు : అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ చనిపోగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో హాస్పిటల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి, రవీందర్ దంపతులు. వీరి పెద్ద కుమారుడికి ఇటీవల కూతురు పుట్టడంతో చూసేందుకు ఇద్దరూ కలిసి బుధవారం మహబూబాబాద్​జిల్లా కేసముద్రం వెళ్లారు.

తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో బుధవారం రాత్రి నర్సంపేటలో బస్సు దిగిన అనంతరం అక్కడ బైక్ తీసుకొని గ్రామానికి బయలుదేరారు. ఇటుకాలపల్లి సమీపంలో రోడ్డు పక్కన గాయాలతే పడిపోయి ఉన్న విజయలక్ష్మి, రవీందర్ దంపతులను గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ వరంగల్​లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురువారం ఉదయం విజయలక్ష్మి చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ రవీందర్ కు వెంటిలేషన్​పై ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామానికి చేరుకొని విజయలక్ష్మి డెడ్ బాడీ వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు సారంగపాణి, మురళీధర్, సాంబరావు, ప్రకాశ్, శ్రీనివాస్ ఉన్నారు.