- ఫామ్‌హౌస్ భూముల విచారణకు మాజీ సీఎం సహకరించాలి
హైదరాబాద్, వెలుగు: ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై ప్రభుత్వం చేపట్టే విచారణకు మాజీ సీఎం కేసీఆర్ సహకరించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. కేసీఆర్ కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములు అక్రమంగా ఉన్నట్లు విచారణలో తేలితే వాటిని స్వాధీనం చేసుకుని భూమిలేని పేద దళితులు, తెలంగాణ ఉద్యమకారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
గురువారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విలీన దినోత్సవంలో కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా సాగిందని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ రికార్డులను తారుమారు చేసి భూములను తమ పేర్లపైకి బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతల భూముల వ్యవహారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించడాన్ని స్వాగతిస్తున్నట్లు కోదండరాం తెలిపారు.
