భద్రాచలం: రామయ్యకు బంగారు పుష్పాలతో అభిషేకం

భద్రాచలం: రామయ్యకు బంగారు పుష్పాలతో అభిషేకం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం సమస్త నదీజలాలు, ఆవుపాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో అభిషేకం, స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. ప్రత్యేక అలంకరణలు చేసి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. 

హారతులు సమర్పించారు. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం నిర్వహించారు. మహబూబాబాద్‌‌‌‌ ఎంపీ పోరిక బలరాంనాయక్​ రామయ్యను దర్శించుకుని పూజలు చేశారు. హైదరాబాద్‌‌‌‌కు చెందిన శ్రీనివాసరావు– పద్మప్రియ దంపతులు నిత్యాన్నదానానికి రూ.1లక్ష విరాళం ఇచ్చారు. కరీంనగర్​కు చెందిన విరాజ్ మార్కెటింగ్​ కంపెనీ స్వామివారి ప్రసాదాల తయారీకి రాతి, వెండి గిన్నెలను విరాళంగా అందజేశారు.