మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కు-టుంబ తగాదాలతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. మండలంలోని కొత్త మొల్గర గ్రామానికి చెందిన కంపిల్లి వెంకటయ్య, భార్య అలివేలు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో శనివారం మధ్య గొడవ జరగగా, ఆగ్రహంతో వెంకటయ్య భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హసన్ పర్తి: హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ డివిజన్ కృష్ణ కాలనీలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటకు చెందిన అనిల్ కుమార్ కృష్ణ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం రాత్రి భార్య రజిత(30)ను కాళ్లు, చేతులు కట్టేసి గొంత కోసం హత్య చేశాడు. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
