ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలి : యూటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ చావ రవి

ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలి :   యూటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ చావ రవి

కామారెడ్డి, వెలుగు: టీచర్ల సమస్యలన్నీ విద్యారంగం, విద్యార్థుల సమస్యలేనని యూటీఎఫ్​స్టేట్​ ప్రెసిడెంట్​ చావ రవి అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని​ ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాంధీపని డిగ్రీ కాలేజీలో నిర్వహిచారు. విద్యారంగంతో పాటు, టీచర్లు ఎందుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు. సమస్యలను పరిష్కరించుకోవాలని తీర్మానాలు చేశారు. చావ రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లు​మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. 

జీవో 25ను సవరించాలని డిమాండ్​ చేశారు. ఈనె15 లోగా టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ​రిలీజ్​ చేయాలని డిమాండ్​చేశారు. స్టేట్​జనరల్ సెక్రటరీ ఎ.వెంకట్ మాట్లాడుతూ.. బడ్జెట్​లో విద్యా రంగానికి కేవలం 7 శాతం లోపు కేటాయించటం దారుణమన్నారు. స్టేట్​ వైస్ ​ప్రెసిడెంట్లు చావ దుర్గా భవాని,  రాజశేఖర్​రెడ్డి, ట్రెజరర్ టి.లక్ష్మారెడ్డి, సెక్రటరీలు వి.శాంతికుమారి, డి,సత్యానంద్, ఎస్.మల్లారెడ్డి, బి.రాజు, కె.రంజిత్​కుమార్, జిల్లా ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీలు, ప్రతినిధులు పాల్గొన్నారు.