భద్రాచలంలో గోదావరికి హారతి

భద్రాచలంలో గోదావరికి హారతి

భద్రాచలం,వెలుగు: ఏరు ఉత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి భద్రాచలంలో పవిత్ర గోదావరికి హారతిని పురోహితులు అందించారు. వరద శాంతించి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని పూజలు చేశారు. 

పురోహితులు రామావఝుల రవికుమార్​శర్మ ఆధ్వర్యంలో నది అష్టోత్తర శతనామార్చన చేసి, రామయ్యకు ముందుగా హారతి ఇచ్చి తర్వాత గోదావరికి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవంలో డీఎస్పీ అరుణ్​కుమార్​ పాల్గొని పూజలు చేశారు.