జయశంకర్ భూపాలపల్లి: పుణ్యస్నానానికి వచ్చి మృత్యువాత

జయశంకర్ భూపాలపల్లి: పుణ్యస్నానానికి వచ్చి మృత్యువాత

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో  ఆదివారం పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి(52) గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హన్మకొండకు చెందిన శ్రీనివాస్‌‌‌‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి కాళేశ్వరం వచ్చారు. త్రివేణి సంగమం వద్ద స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యాడు.  

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక ఈతగాళ్లు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రంగా శ్రమించిన వరద ఉధృతిలో కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. గోదావరి ఒడ్డుకు చేరిన డెడ్‌‌‌‌బాడీని బయటకు తీసుకువచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్‌‌‌‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.