వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడి పడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి.ఈ ఘటనలో పెరాలసిస్ వ్యాధితో చికిత్స పొందుతున్న మస్తాన్ (55)తో పాటు అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార్ (33) గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే వైద్యులు పరిశీలించి చికిత్స అందిస్తున్నారు.
బాధితులు జనగామ జిల్లా ఘన్‌పూర్ నియోజకవర్గం, జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.ప్రమాద సమయంలో వార్డులో ఉన్న ఇతర రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి భవనం నిర్వహణపై కూడా ఈ ఘటనతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
