మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి రాని మెజార్టీ : చైర్మన్ పీఠంపై ఉత్కంఠ

మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి రాని మెజార్టీ : చైర్మన్ పీఠంపై ఉత్కంఠ

మహబూబాబాద్ మున్సిపాలిటీ ఉత్కంఠ రేపుతోంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవటంతో.. చైర్మన్ పీఠం ఎవరికి అనేది ఆసక్తి రేపుతోంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. చైర్మన్ పీఠం దక్కాలంటే 19 వార్డులు గెలవాల్సి ఉంది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 

కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ 13 వార్డుల్లో గెలిచి సింగిల్ లార్జస్ట్ పార్టీగా నిలిచింది. సీపీఎం పార్టీ 3 వార్డుల్లో గెలవగా.. సీపీఐ పార్టీ 3 వార్డుల్లో విజయం సాధించింది.బీజేపీ ఒక్క వార్డులో గెలిచింది. ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రాకపోవటంతో సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు అవసరం అవుతుంది. కమ్యూనిస్టుల మద్దతు ఎవరికి అనేది ఆసక్తిగా మారింది. చైర్మన్ పీఠం ఎవర్ని వరించనుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.