భూపాలపల్లి ఆస్పత్రి లో కాపర్ వైర్ దొంగలు.. పవర్ కట్.. సీటీ స్కాన్, ఎక్స్ రే సేవలు బంద్

భూపాలపల్లి ఆస్పత్రి లో కాపర్ వైర్ దొంగలు.. పవర్ కట్.. సీటీ స్కాన్, ఎక్స్ రే సేవలు బంద్
  • భూపాలపల్లి దవాఖానలో నిలిచిపోయిన కరెంట్​ సప్లై

జయశంకర్  భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్  ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి కాపర్  వైర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో కరెంట్  సప్లై లేక దవాఖానలో సీటీ స్కాన్, ఎక్స్​రే సేవలు బంద్  అయ్యాయి. హాస్పిటల్​ ఆవరణంలోని సీటీ స్కాన్  మెషీన్​ రూమ్​ వెనక ఏర్పాటు చేసిన రెండు ఎర్తింగ్  పాయింట్ల వద్ద ఉండే కాపర్  వైర్ ను దొంగలు కట్​ చేసి తీసుకెళ్లడంతో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. సీటీ స్కాన్  మెషీన్​ రూమ్​కు కరెంట్  సప్లై నిలిచిపోవడంతో సేవలు బంద్  అయ్యాయి. గతంలోనూ హాస్పిటల్​ ఆవరణంలో కాపర్  వైర్  చోరీకి గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని విచారించారు.