T20 World Cup: పీకల్లోతు కష్టాల్లో ఆసీస్.. జింబాబ్వే గెలిచేనా..?

T20 World Cup: పీకల్లోతు కష్టాల్లో ఆసీస్.. జింబాబ్వే గెలిచేనా..?

T20 World Cup: T20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా ఆస్ట్రేలియా, జింబాంబ్వే పోటీ పడుతున్నాయి. టాస్‌ గెలిచిన కంగారుల జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.  మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాంబ్వే నిర్ణీత 20 ఓవర్లలో జస్ట్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 169 రన్స్ చేసేసింది.  ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌, తాదివనాషే మారుమణి జింబాంబ్వేకు మంచి శుభారంభం ఇచ్చారు. వీరు ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. మారుమణి (21 బంతుల్లో, 7 ఫోర్లతో 35 పరుగులు) పెవిలియన్ బాట పట్టినప్పటికీ,  బెన్నెట్‌ అర్థ శతకంతో (56 బంతుల్లో, 7 ఫోర్లతో 64 నాటౌట్) చివరి వరకు క్రీజులో నిలిచాడు.  

ఇక, మారుమణి డకౌట్ కి వెళ్లిన తర్వాత క్రీజులోకి వచ్చిన ర్యాన్ బర్ల్ ( 30 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు) బెన్నెట్‌తో కలిసి సెకండ్ వికెట్‌కు 70 రన్స్ పార్టనర్ షిప్ నెలకొల్పాడు. అలాగే, చివర్లో సికిందర్‌ రాజా (13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 25 నాటౌట్) వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నం చేశాడు. జింబాబ్వే తన ఇన్నింగ్స్‌లో ఒకే ఒక సిక్స్‌ కొట్టింది. అది కూడా లాస్ట్ బాల్ కి సికిందర్‌ రాజానే కొట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్‌ స్టోయినిస్‌, కామెరూన్‌ గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇతర బౌలర్లు వికెట్లు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. 

అయితే, లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం పవర్ ప్లేలోనే ఆస్ట్రేలియా జట్టు టాప్ ఆర్టర్ కుప్పకూలిపోయింది. సికిందర్ రాజా వేసిన మొదటి ఓవర్లో మంచి ఊపు మీద కనిపించిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్ లు ఈ ఓవరల్లో ఏకంగా 13 పరుగులు రాబట్టారు. ఇక, రెండో ఓవర్ లో ముజారబానీ బ్లెస్సింగ్ వేసిన మొదటి బంతిని ఆడిన జోష్ ఇంగ్లీస్ (8)  తాషింగా ముసెకివాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరున్ గ్రీన్ (0), టీమ్ డెవిడ్ (0) వరుసగా డకౌట్ అయ్యారు. దీంతో ఆసీస్ టీం పీకల్లోత్తు కష్టాల్లో పడింది.  బ్రాడ్ ఇవాన్స్  వేసిన నాలుగో ఓవర్ 3వ బంతికి ఆసీస్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (17) అవుట్ కావడంతో 34 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లను కంగారుల జట్టు కోల్పోయి, తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే, తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ (31) కాసేపు బ్యాట్ ఝళిపించనప్పటికీ రియాన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక, 110 పరుగులకే 5 వికెట్ల పడిపోగా.. ప్రస్తుతం  మాట్ రెన్షా (46), మార్కస్ స్టోయినిస్ (4) క్రీజులో ఉన్నారు. కాగా, మరో 33 బంతుల్లో 60 పరుగుల వెనుకంజలో ఆసీస్ జట్టు ఉంది.