అధ్యక్షా ఐదు రోజులే.!కృష్ణా జలాలే లక్ష్యంగా అసెంబ్లీ

అధ్యక్షా ఐదు రోజులే.!కృష్ణా జలాలే లక్ష్యంగా అసెంబ్లీ
  • పీపీటీకి సిద్ధమైన రాష్ట్ర సర్కారు మంత్రులంతా ఉండాలన్న సీఎం
  •  కౌంటర్ కు సిద్ధం కావాలని పిలుపు
  •  పీపీటీకి చాన్స్ ఇవ్వాలన్న బీఆర్ఎస్
  •  గ్రేటర్ విలీనంపైనా చర్చించే చాన్స్
  •  32 అంశాలపై చర్చిద్దామన్న బీజేపీ 
  • 15 అంశాలపై డిస్కషన్ చేద్దామన్న బీఆర్ఎస్

 కృష్ణా జలాల్లో వాటాలు, ఒప్పందాలే లక్ష్యంగా ఈ సారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.జనవరి 2 నుంచి 7 వరకు  సెషన్  నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జనవరి 4న  సెషన్ ఉండబోదని తెలుస్తోంది. కృష్ణాలోని 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 12 టీఎంసీలు, తెలం గాణకు 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణశాసనం రాసింది బీఆర్ఎ స్ సర్కారు అని, అప్పటి సీఎం కేసీఆర్, నీళ్ల మంత్రి హరీశ్  అని ప్రభుత్వం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలు చాలని కేంద్రాని కి లేఖ రాసిందని అంటోంది. 90 టీఎంసీల సాధన కోసం పనిచేయాలని డిమాండ్ చేస్తోంది. జలద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపిస్తోంది. ఈ అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం అసెంబ్లీని సమావేశ పర్చింది. 

ఇదే సమయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో సమావేశమయ్యారు. సెషన్ ముగిసే వరకు ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీకి గైర్హా జరు కావద్దని సూచించారు. నీటి వాటాల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్ ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకొనే పనిలో ఉందన్నారు. ప్రతిప క్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉంటాలన్నారు. పాయింట్ఆఫ్ ఆర్డర్ ముఖ్యమని, అవకాశం కోసం అందరూ ఎదురు చూడాలని సూచించారు. అడిగే ప్రతి అంశానికీ సమాధానం ఇవ్వాలని అన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాము 32 అంశాలపై చర్చించాలని, కనీసం 20 రోజుల పాటు సభ నడపాలని కోరినట్టు జేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. 15 అంశాలపై చర్చకు బీఏసీలో పట్టుబట్టి నట్టు మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. దీంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో కృష్ణ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఒక వేళ మంత్రి పీపీటీ ఇస్తే తమకూ చాన్సివ్వాలని బీఆర్ఎ పట్టుబట్టుతోంది. ఇదే క్రమంలో బీజేపీ జీహెచ్ఎంసీ విస్తరణపైనా చర్చించేందుకు సమయం కోరుతోంది. ఏది ఏమైనా ఈ సారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలున్నాయి.

►ALSO READ | రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు.. గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికంగా అమ్మకాలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు