ఐఈఎస్/ ఐఎస్ఎస్ నోటిఫికేషన్

 ఐఈఎస్/ ఐఎస్ఎస్ నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​సీ) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్(ఐఎస్ఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 03

ఖాళీలు: 44. 

విభాగాల వారీగా ఖాళీలు: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ 16, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ 28.


ఎలిజిబిలిటీ: 

ఐఈఎస్: ఎకనామిక్స్‌‌‌‌, అప్లైడ్ ఎకనామిక్స్‌‌‌‌, బిజినెస్ ఎకనామిక్స్‌‌‌‌,ఎకనామెట్రిక్స్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

ఐఎస్ఎస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా స్టాటిస్టిక్స్‌‌‌‌, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్‌‌‌‌, అప్లైడ్ స్టాటిస్టిక్స్​లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం  రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11.

లాస్ట్ డేట్: మార్చి 03.

ఎగ్జామ్ డేట్: జూన్ 19. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు upsc.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.