వెలుగు స్పెషల్ : కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సార్‌‌‌‌‌‌‌‌! మీ ఇంటికి మేమొస్తే.. పసుపు నీళ్లతో శుద్ధి చేస్తరా?

వెలుగు స్పెషల్ : కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సార్‌‌‌‌‌‌‌‌!  మీ ఇంటికి  మేమొస్తే.. పసుపు నీళ్లతో శుద్ధి చేస్తరా?

దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 సంవత్సరాలు అవుతోంది.  ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 17 ప్రకారం భారతదేశంలో అంటరానితనం నిషేధం.  అది పాటించినా,  ప్రోత్సహించినా చట్టరీత్యా నేరం.  రాజ్యాంగం మీద  ప్రమాణం చేసి  రాజ్యాంగానికి కట్టుబడి పాలన చేస్తామని  ప్రమాణం చేస్తున్నారు.

 పదవులు అనుభవించే నాయకులు.  ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని  రాంలీలా మైదానంలో ఆగస్టు 10న ఏఐసీసీ అధ్యక్షుడు  మల్లిఖార్జున ఖర్గే  సభ పెట్టారు.  సభ అనంతరం బీజేపీ  అనుబంధ సంఘం రామ్‌‌‌‌‌‌‌‌సేన సభ్యులు ఖర్గే  సభపెట్టిన  రాంలీలా మైదానాన్ని పసుపు నీళ్లతో కడిగి శుద్ధి చేశారు.  

దక్షిణ  భారతదేశంలోని  తెలంగాణ  రాష్ట్రంలో  మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ రావు తన ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌లో  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 6న తమ  పార్టీ ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీలను  పిలిపించి  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 7న తెలంగాణ  అసెంబ్లీ  సమావేశాలలో తమ సభ్యులు ఏ రకంగా ప్రవర్తించాలని  దిశా నిర్దేశం  చేసి  పంపించాడు.  

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 7న అసెంబ్లీ 3వ గేటు దగ్గర  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  నల్ల షర్ట్‌‌‌‌‌‌‌‌లు  వేసుకొని  హంగామా సృప్టించారు.  ఆ గొడవలో  ఖమ్మం జిల్లాకు చెందిన  ఎమ్మెల్సీ  తాత  మధుసూదన్‌‌‌‌‌‌‌‌  అసెంబ్లీ  స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి  ’స్పీకర్​గాడు  లం... కు  చెప్పినాడా మమ్మల్ని ఆపమని’ అంటూ బూతులు తిట్టాడు.  అదేవిధంగా  మహబూబ్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు  చెందిన ఎమ్మెల్సీ  నవీన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కూడా స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  దృష్టిలో పెట్టుకొని బూతులు మాట్లాడాడు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న  స్పీకర్‌‌‌‌‌‌‌‌ను  బూతులు తిడుతూ అవమానపర్చటం  నేరం.  ప్రస్తుతం  స్పీకర్‌‌‌‌‌‌‌‌ స్థానంలో  దళిత కులానికి  చెందిన వ్యక్తి ఉండటం వలన,  స్పీకర్‌‌‌‌‌‌‌‌  దళితుడు కాబట్టి బూతులతో తిట్టారు. 

స్పీకర్‌‌‌‌‌‌‌‌  స్థానంలో వేరే  కులవ్యక్తి  ఉంటే ఇలా మాట్లాడేవారా..  

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 6న  ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌లో స్వయంగా  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ సభ్యులకు బూతుల  పురాణాలు నూరిపోసి పంపించాడు.  స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తమ  సభ్యులు బూతులు తిట్టినప్పుడు ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  ప్రతిపక్ష నేత  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఖండించాలి కదా, కానీ అతను ఖండించలేదు.   కనుక  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 8న మాదిగ, మాలలు  వేలాదిగా డప్పులు తీసుకొని ఎర్రవల్లిలోని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ ఇల్లుకు వెళ్ళారు.  

దళితులకు  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ క్షమాపణ  చెప్పాలని  మాదిగ, మాల  జేఏసీ  ఆధ్వర్యంలో  నిరసన డప్పు కొట్టారు.  80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దళితులను బూతులు తిట్టడం ఏమిటని దళితులు నిరసన దండోరా వేశారు తప్పా? 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటి ముందు పసుపు నీళ్లతో శుద్ధి

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 8న  ఉదయం 11 గంటలకు  ప్రజ్ఞాపూర్‌‌‌‌‌‌‌‌లో  డప్పుకొట్టి  ఎర్రవల్లిలోని కేసీఆర్‌‌‌‌‌‌‌‌  ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు  యాత్ర  మొదలుపెట్టాం.  వరదరాజుపూర్‌‌‌‌‌‌‌‌ దగ్గర  అందరం  చేరుకొని  డప్పు దరువులతో ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌కు  బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం 3 గంటల వరకు వరదరాజు పూర్‌‌‌‌‌‌‌‌ నుంచి  ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ దాకా  నిరసన డప్పుల మోత మోగించాం.  అక్కడనుంచి పోలీసులు ఆందోళనకారులను  పంపించారు. 

సాయంత్రం 4 గంటలకు  వరదరాజుపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామస్తులు  మాదిగ, మాలలు మా ఊరు  నేలను మలినం చేశారని పసుపు నీళ్లతో నేలను శుద్ధి చేశారు.   సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 8న ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌  ముందు జరుగుతున్న  తతంగాన్ని,  నిరసన డప్పుల మోతలను తన ఇంట్లోని టీవీలో  లైవ్‌‌‌‌‌‌‌‌ చూస్తున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌,  సాయంత్రం  వరదరాజు పూర్‌‌‌‌‌‌‌‌  గ్రామంలో  పసుపు నీళ్ల శుద్ధి  కూడా చూసి ఉండొచ్చు.  వెంటనే పసువు నీళ్ల శుద్ధిని  ఖండించాలి కదా?   

రాజ్యాంగం లోని ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 17,  చట్టం ప్రకారం  అంటరానితనం  నేరం  అని తెలిసి రాజ్యాంగం  మీద  ప్రమాణం చేసిన  మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పసుపునీళ్ల తతంగాన్ని సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 9 నాడు కూడా తన ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ ముందు  ఉన్న నేలను,   రోడ్డును  పసుపు నీళ్లతో శుద్ధి  చేయించాడు.  ఇది ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 17కు విరుద్ధం.

దళితులు  నిలబడిన  నేలను పసుపు  నీళ్లతోనే  ఎందుకు  శుద్ధి చేశారు.  పసుపును  గాయాలైన దగ్గర రుద్దుతారు.  ఎందుకంటే  సెప్టిక్‌‌‌‌‌‌‌‌  కాకుండా ఉండటానికి పసుపును  రుద్దుతారు. అంటే దళితులు నడిచిన నేలలో ఇతరులు నడిస్తే  అంటురోగాలు వస్తాయి. అంటూ  అయితది,  కనుక  దళితులు నడిచిన నేలను పసువు నీళ్లతో శుద్ధి చేశారు.  ఉత్తర భారత దేశంలో మల్లిఖార్జున్‌‌‌‌‌‌‌‌ ఖర్గే  నిలబడ్డ మైదానం,   దక్షిణ  భారతదేశంలో   కేసీఆర్‌‌‌‌‌‌‌‌  ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌  ముందు  నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.

మాదిగ,  మాలల పట్ల కపట నాటకం

14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో  తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే  అని  ఊరూరా  ప్రచారం చేశారు.  తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రచారం చేసి తూళ్ళ  దేవేందర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌  పార్టీ  నవ తెలంగాణను,  నాగం జనార్దన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి  తెలంగాణ నగర పార్టీని తెరమరుగుచేశాడు.  తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే దళిత సీఎం ముసుగును  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తీసేసి తెలంగాణ రాష్ట్రంకు  తను  ముఖ్యమంత్రి అయ్యాడు. 

 ఉప ముఖ్యమంత్రిగా మాదిగ కులస్తుడు తాటికొండ రాజయ్యను చేసినా ఆ తర్వాత 6 నెలలు  నిండకముందే అతనిని అకారణంగా బర్తరఫ్  చేశాడు.  మాదిగ కులంగా గుర్తింపు పొందిన పద్మశాలి+బండ్ల మిక్సింగ్‌‌‌‌‌‌‌‌ కులమైన కడియం శ్రీహరిని  ఉప  ముఖ్యమంత్రిగా  కేసీఆర్‌‌‌‌‌‌‌‌  కొనసాగించాడు.

 రెండోసారి   సీఎంగా ఉన్న  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మళ్లీ  కడియంను ఉప ముఖ్యమంత్రి  చేసుకున్నాడేగాని మాల  కులపోళ్లనుగాని,  ఒరిజినల్‌‌‌‌‌‌‌‌  మాదిగ  కులపోళ్లనుగాని ఉప ముఖ్యమంత్రిగా   కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చేయలేదు.  ఈ విషయాలు ఈ సమయంలో ఎందుకు  ప్రస్తావన  తెస్తున్నాను అంటే మాదిగ,  మాలల మీద  కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఎంత వివక్షత ఉందో  తెలుపుతున్నాను. 

మేం నిలబడితే నేల మైల పడతదా..

రాంలీలా మైదానంలో  దళితుడైన ఖర్గే  నిలబడ్డ నేలను పసుపు నీళ్లతో  బీజేపీవాళ్లు శుద్ధి  చేశారు.  ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌ దగ్గర  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దళితులు నిలబడ్డ నేలను శుద్ధి చేశారు కదా..  మీ పార్టీలు,  మా మా వాడకు వస్తే  మైలపడతాయి.  మా మా ఓట్లు మీ మీ గుర్తులకు వేస్తే  మీ మీ పార్టీ గుర్తులు కూడా  మైలపడతాయి కదా సార్లు.. కనుక మీ పార్టీలు  మా మా వాడకు వచ్చారో తస్మాత్‌‌‌‌‌‌‌‌ జాగ్రత్త. 

అంతా దగా మోసం

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సార్‌‌‌‌‌‌‌‌  మీరు ఏ యుగంలో  జీవిస్తున్నారు.  రాతియుగంలోనా  లేక  త్రేతాయుగంలోనా  లేక ద్వాపర యుగంలో  జీవిస్తున్నారా.. ఇది కలియుగం సార్‌‌‌‌‌‌‌‌.  జంబూ ద్వీపం,  భరత్‌‌‌‌‌‌‌‌ ఖండం.. భారతదేశానికి  స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది సార్‌‌‌‌‌‌‌‌..  ప్రపంచంలోనే   గొప్ప రాజ్యాంగం  మనదని కొనియాడుతున్నారు సార్‌‌‌‌‌‌‌‌..  మనుషులంత  సమానమని చట్టాలు  చేసుకున్నాం. 

మీరు తెలంగాణ ఉద్యమం చేస్తిరి..  తెలంగాణ రాష్ట్రంకు మొదటి ముఖ్యమంత్రి  దళితులు  అంటిరి.  మీరే అవుతిరి,  పది  సంవత్సరాలు  మమ్ములను పాలిస్తిరి..  దళితులకు మూడు ఎకరాల భూమి  ఇస్తామంటిరి. అంతా మోసం  మోసం.   దళితులకు అవమానం,  అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ రాసిన రాజ్యాంగంను తొలగించి కొత్తది రాయాలంటివి.  మీ పాలనలో ఒక్కసారైనా ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటీ విజిలెన్సు మీటింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టారా..  లేదు పెట్టలేదు.  ఎందుకంటే  మీకు  దళితులంటే వివక్షత.   అందుకే మీ ఇంటి ముందుకు దళితులు వస్తే  పసుపు నీళ్లతో  శుద్ధిచేసి అభినవ  మనువుగా గుర్తింపు పొందావు సార్‌‌‌‌‌‌‌‌.

ఇంకా ఎన్నాళ్లు ఈ అంటరానితనం  

భారత దేశంలో  ప్రముఖ దళిత నేతలు అంటరానితనాన్ని చవిచూశారు.  మొట్టమొదట డా. బి.ఆర్. అంబేద్కర్‌‌‌‌‌‌‌‌, తర్వాత  భారతదేశ ఉప ప్రధాని  డా. బాబూ  జగ్జీవన్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌ని  తిరుపతి  దేవస్థానం గుడిలోకి రానియ్యలేదు,  మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌‌‌‌‌‌‌‌  కోవింద్‌‌‌‌‌‌‌‌ను గుజరాత్‌‌‌‌‌‌‌‌  రాష్ట్రంలో  గుడిలోకి  రానియ్యకుండా  గడప దగ్గరే  ఆపారు.  నేడు రాష్ట్రపతి  ద్రౌపది ముర్మును  నూతన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌  ప్రారంభోత్సవానికి రానియ్యలేదు.  అయోధ్య రాముడి దేవాలయ   ప్రారంభానికి  పిలువలేదు.  కారణం వివక్షత  వివక్షత.   ఇంకా ఎన్నాళ్లు  దళితులకు ఈ అంటరానితనం. 

దళితులకు అండ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  జెండా!

దేశానికి  స్వాతంత్ర్యం  వచ్చిన నాటినుంచి అంటరాని కులాలైన దళితులకు అండగా నిలబడింది  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీయే...  వెట్టిచాకిరి చేస్తున్న దళితులకు  నివాసం కల్పించింది  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌,  భూములు  పంచింది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, వ్యవసాయం  చేసేందుకు ఎడ్ల బండ్లు ఇచ్చింది,  నీళ్ల సదుపాయం కోసం  బావులు,  బోర్లు వేసింది  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, చదువు  నేర్పించింది  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌,  రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌లు  ఇచ్చింది  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌,   రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ను  గ్రూపులుగా పంచింది కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌. ఇందిరమ్మ ఇంట్లో పుట్టాం.  ఇందిరమ్మ ఇంట్లోనే  పెరిగి పెద్దయ్యాం,  పెళ్లిళ్లు  ఇందిరమ్మ ఇంట్లోనే,  పిల్లలు కన్నది ఇందిరమ్మ  ఇంట్లోనే,  వారిని పెద్ద చేసింది  ఇందిరమ్మ  ఇంట్లోనే,   నేడు మళ్ళీ జీవిస్తున్నది  ఇందిరమ్మ  ఇంట్లోనే.

దేశానికి  రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీని  ప్రధానిని చేసుకొని,  తెలంగాణ రాష్ట్రంలో  రేవంతన్నతోనే  మా  గమ్యం గమనం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే.  ఎస్సీ  రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ను వర్గీకరణ చేసింది.  లావాణి  భూములకు  హక్కుదారులను చేసేది.  ఆర్థికంగా మా మా జాతులను ఎదిగించేది కాంగ్రెస్సే. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సార్‌‌‌‌‌‌‌‌.. మీకు దళితుడు ఎదురుపడితే అపశకునమా?

2001 నుంచి 2009 వరకు  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వెంబడి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేను (సతీష్‌‌‌‌‌‌‌‌ మాదిగ)  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గమనించాను.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌  ఏదైనా  కార్యానికి తన ఇంటి నుంచి బయలుదేరుతున్న  సమయంలో మాదిగలు,  మాలలు ఎవ్వరైనా ఎదురుపడితే  తిరిగి ఇంటిలోకి వెళ్ళేవాడు.  వాళ్లు కనపడకుండా పక్కకు వెళ్లిన తర్వాత ఇంటినుంచి బయలుదేరేవాడు.  

తెలంగాణ ఉద్యమ సమయంలో తనను నమ్మి,  తన వెంబడి తెలంగాణ ప్రజలు ఎక్కువగా రాలేదు. ఎందుకంటే  తెలంగాణలో  దొరలు అంటే దొంగలు, దోపిడీదారులు తెలంగాణ  ప్రజల  బట్టలు విప్పి బతుకమ్మలాడారు,    తెలంగాణలో దొరలు  అన్ని వర్గాలను దోచుకున్నారు,  భూస్వాములుగా  వేలాది ఎకరాల భూమిని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. 

 నిజాంకు అండగా ఉన్న ఈ దొరలను ఎర్రజెండాతో  ఊర్ల  నుంచి తరిమారు.  ఈ  దొరలను తెలంగాణ  ప్రజలు నమ్మరు.   కేసీఆర్‌‌‌‌‌‌‌‌  వెంబడి  నడవరు అని మేధావులు  తెలుపగా.  తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కపట నాటకంతో ప్రకటించి  తెలంగాణ  ఉద్యమం తీవ్రతరం చేశాడు. 

- దేవని సతీష్‌‌‌‌‌‌‌‌ మాదిగ,మాదిగ, మాల జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ 

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.