టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు జానకి రామ్ మారెల్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ' కామ్రేడ్ కళ్యాణ్' ( Comrade Kalyan ) . దసరా కానుకగా అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు.
లేటెస్ట్ ఈ మూవీ నుంచి 'ఎత్తర ఎత్తు పిడికిలి ఎత్తు' లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించగా.. భాస్కరభట్ల సాహిత్యమందించారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు . విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
►ALSO READ | Allu Arjun: హ్యాపీ బర్త్‌డే క్యూటీ.. 'రాకా' బిజీలోనూ సీక్రెట్ వెకేషన్.. స్నేహారెడ్డితో అల్లు అర్జున్!
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, అల్లరి మేనరిజమ్స్ వేరే లెవల్లో ఉండనుంది. హీరోయిన్ మహిమా నంబియార్ తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.. కళ్యాణ్ ( శ్రీవిష్ణు )తల్లిగా సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తనదైన నటనతో అలరిస్తున్నారు., మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ను పట్టుకోవడానికి పరిగెత్తే పోలీస్ ఆఫీసర్‌గా షైన్ టామ్ చాకో నెగెటివ్ అండ్ ఫన్నీ షేడ్స్‌లో మెరవనుంది. ఇక వెన్నెల కిషోర్, సత్యతో పాటు టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు రంగంలోకి దిగడంతో వినోదం రెట్టింపు కానుంది.
