సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ సీఈఈఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 26.
ఖాళీలు: 16.
విభాగాల వారీగా ఖాళీలు: పీఏటీ–I 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్–I 3, ప్రాజెక్ట్ అసోసియేట్–I 2, ప్రాజెక్ట్ అసోసియేట్–II 2, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 3, జూనియర్ రీసెర్చ్ ఫెలో 2, ప్రాజెక్ట్ అసోసియేట్ –I/ II (జీఏపీ– 3423) 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఐటీఐ, బీఈ/ బి.టెక్., బీవీఎస్సీ/ బీఫార్మా, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 26.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.ceeri.res.in. వెబ్సైట్ను సందర్శించండి.
