నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయం..చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ గెలుపు

నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయం..చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ గెలుపు

నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికలలో సంచలన విజయం నమోదు అయింది. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో ట్రాన్స్‌జెండర్ సుధాకర్ స్వతంత్రంగా పోటీచేసి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే.. 

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ1వ వార్డునుంచి ట్రాన్స్ జెండర్ సుధాకర్ గెలిచి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ అభివృద్ది లక్ష్యం గా వరుస హామీలతో ఓటర్లను ఆకట్టుకుని ప్రత్యర్థులను ఓడించారు. 

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు ఎస్సీ జనరల్ వర్గానికి రిజర్వ్ కాగా.. సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన అభివృద్ధి ప్రణాళికలను ప్రజల ముందుంచి ఓటర్ల నమ్మకాన్ని పొందారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్, సీపీఎం పొత్తు భాగంగా సీపీఎం అభ్యర్థి, బీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చినా వార్డు ప్రజలు స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ను గెలిపించారు.