సిటీ నెట్వర్క్, వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆఫీసర్లు అందరూ పొద్దటి నుంచి రాత్రి వరకు ఫీల్డ్లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనాన్ని హైదరాబాద్సీపీ సజ్జనార్, డీసీపీ కె.శిల్పవల్లితో కలిసి పర్యవేక్షించారు.
అలాగే, బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో టీజీ ఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డితో కలిసి నగరంలో శోభాయాత్ర, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జియో ట్యాగింగ్ యాప్ ద్వారా నమోదైన14,850 విగ్రహాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకే దాదాపు 10,300 విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని వెల్లడించారు.
అన్ని విగ్రహాల నిమజ్జనాన్ని శుక్రవారం తెల్లవారేసరికి పూర్తి చేయాలనే లక్ష్యంతో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 30కి పైగా అదనపు క్రేన్లు, బేబీ పాండ్స్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మల్కాజిగిరి పోలీస్కమిషనర్సుమతి సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్, బండ చెరువు, చర్లపల్లి తదితర నిమజ్జన ప్రాంతాలను విజిట్చేశారు.
అలాగే, కమిషనరేట్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మరోవైపు మున్సిపల్కమిషనర్వినయ్ కృష్ణారెడ్డి కూడా నిమజ్జన కేంద్రాలను విజిట్‌చేసి నిమజ్జనాలను పరిశీలించారు.
