చెత్తను వేరు చేయడంపై GHMC అవగాహన

చెత్తను వేరు చేయడంపై GHMC అవగాహన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్‌‌‌‌‌‌‌‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని చెత్తను ఇంటివద్దనే వేరు చేయాలని భక్తులకు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ శుక్రవారం అవగాహన కల్పించింది. తెలంగాణ అండ్‌‌‌‌‌‌‌‌ ఆంధ్ర ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (టాప్మా) సహకారంతో  ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌లో బడా గణేశ్‌‌‌‌‌‌‌‌ ఊరేగింపునకు హాజరైన భక్తులకు ఈ అవగాహన కల్పించారు.

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌‌‌‌‌, అడిషనల్​కమిషనర్‌‌‌‌‌‌‌‌ బి సంతోష్‌‌‌‌‌‌‌‌ తో కలిసి దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. చెత్తను రోడ్లపై పడేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని అధికారులు సూచించారు. ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి నిర్ణీత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కలెక్షన్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో వేయాలని అవగాహన కల్పించారు.