18 ఏళ్ల తర్వాత ధనుష్‌‌, వడివేలు కాంబో

18 ఏళ్ల తర్వాత  ధనుష్‌‌, వడివేలు కాంబో

ధనుష్‌‌ హీరోగా ‘సార్‌‌‌‌’ చిత్రాన్ని నిర్మించిన  సితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ సంస్థ.. తను హీరోగా మరో సినిమాను నిర్మిస్తోంది.  ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు.  శుక్రవారం తమిళనాడు శివగంగ జిల్లాలోని ప్రసిద్ధ మారనాడు కరుప్పణసామి దేవాలయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  పద్దెనిమిది అడుగుల పొడవైన భారీ కత్తిని ధనుష్‌‌ స్వామి వారికి కానుకగా సమర్పించారు.

హీరోయిన్‌‌ ప్రీతి ముకుందన్‌‌, వడివేలు, ఎస్‌‌జే సూర్య,  దర్శకుడు తమిళరాసన్ పచ్చముత్తు,  సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.  మధురై గ్రామీణ నేపథ్యంతో పవర్‌‌ఫుల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ కెరీర్‌‌‌‌లో ఇది 56వ సినిమా. 18 ఏళ్ల విరామం తర్వాత ధనుష్‌‌,  వడివేలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది. తమ ఇద్దరి మధ్య ఓ మూడో వ్యక్తి కల్పించిన విభేదాల కారణంగానే ఇన్నేళ్లు తాము కలిసి వర్క్‌‌ చేయలేకపోయామని వడివేలు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.