రైస్ మిల్ సీజ్.. జీఎస్టీ బకాయిలు చెల్లించకపోవడంతో

రైస్ మిల్ సీజ్.. జీఎస్టీ బకాయిలు చెల్లించకపోవడంతో

గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలోని సంతోషిమాత రైస్ మిల్లును కేంద్ర జీఎస్టీ అధికారులు గురువారం రాత్రి సీజ్ చేశారు. 2017 నుంచి 2022 వరకు చెల్లించాల్సిన రూ.1.81 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు మిల్లును సీజ్ చేసి, ప్రాంగణం వెలుపల నోటీసులు అంటించారు. బకాయిల వసూళ్ల కోసం రైస్ మిల్లును వేలం ద్వారా విక్రయించే అవకాశముందని తెలిపారు.

ఇదివరకే సీఎంఆర్ చెల్లింపుల విషయంలో కేసు నమోదు కాగా.. ఈ మిల్లుకు సంబంధించి రైతులకు కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. మిల్లు సీజ్ కావడంతో తమ బకాయిలు ఎలా వసూలవుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.