కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే ఔత్సాహికులకు, కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇక.. యూట్యూబ్లో మానిటైజేషన్ అంత సులభం కాదు. ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే.. వెయ్యి మంది సబ్స్రైబర్లు, 365 రోజుల్లో 4 వేల వాచ్ అవర్స్ తప్పనిసరి.
🚨 YouTube is doubling the viewership requirements for new creators to earn ad and Premium revenue.
— Indian Tech & Infra (@IndianTechGuide) August 11, 2026
From February 1, creators will need 8,000 watch hours in 12 months or 20 million Shorts views in 90 days. pic.twitter.com/qv38RXPFXj
షార్ట్స్ కంటెంట్ అయితే 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ వస్తేనే ఆ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కు.. అంటే యూట్యూబ్ నుంచి మనీ సంపాదించుకునేందుకు అర్హత పొందుతుంది. కానీ.. ఇకపై ఈ మానిటైజేషన్ రూల్స్ మరింత కఠినంగా మారాయి.
ఫిబ్రవరి 1, 2027 నుంచి, మానిటైజేషన్కు అర్హత పొందాలంటే, 365 రోజులలో 8 వేల వాచ్ అవర్స్ లేదా మూడు నెలల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ అవసరం. వెయ్యి మంది సబ్స్రైబర్ల విషయంలో మాత్రం యూట్యూబ్ జాలి చూపించింది. ఇప్పటి లానే వెయ్యి మంది సబ్ స్రైబర్లు అయితే సరిపోతుంది.
సింపుల్గా రెండే రెండు ముక్కల్లో చెప్పాలంటే.. 2027, ఫిబ్రవరి 1 తర్వాత కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ల ఛానల్ మానిటైజేషన్కు అర్హత సాధించాలంటే.. 12 నెలల్లో 8 వేల వాచ్ అవర్స్ లేదా 90 రోజుల్లో షార్ట్స్ వ్యూస్ 20 మిలియన్ మైలురాయిని చేరుకోవడం తప్పనిసరి.
