మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు.. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 10 గంటల వరకు వచ్చిన ఫలితాల్లో.. కాంగ్రెస్ దూకుడుగా ఉంది. మెజార్టీ స్థానాల్లో భారీ ఆధిక్యం దిశగా వెళుతుంది. 

ఉదయం 10 గంటల సమయానికి అధికారికంగా ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే.. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 16 మున్సిపాలిటీల్లో గెలుపు దాదాపు ఖాయమైంది. రెండు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మున్సిపాలిటీల్లో బీజేపీ ఇప్పటి వరకు ఒక్క దాంట్లోనూ ఆధిక్యంలో లేదు. 

ఇక 7 కార్పొరేషన్ల విషయానికి వస్తే.. మూడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్క కార్పొరేషన్ లోనూ ఆధిక్యత రాబట్టలేకపోయింది. 

బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరగటంతో పూర్తి ఫలితాలు రావటం సమయం పడుతుందని చెబుతున్నారు అధికారులు. సాయంత్రానికి స్పష్టమైన తీర్పు వెల్లడి అవుతుందని చెబుతున్నారు అధికారులు.