జైపూర్: టీమిండియా హిట్టర్‌అభిషేక్‌శర్మ సిక్సర్ల సునామీ సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరగబోయే మ్యాచ్ కోసం పంజాబ్ కెప్టెన్ అభిషేక్ ఆదివారం జైపూర్‌లోని అనంత క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా స్పిన్నర్లు, పేసర్లు అని లెక్క చేయకుండా ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. దాదాపు గంటసేపు ప్రాక్టీస్ చేసిన అతను బాల్‌ను డిఫెన్స్ చేసిన నాలుగుసార్లు ఔటయ్యాడు. కానీ హిట్టింగ్ చేసిన ప్రతీ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు. అభిషేక్ బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసి అక్కడున్న బౌలర్లందరూ జడుసుకున్నారు.
ఆఫ్, లెగ్ బ్రేక్, గూగ్లీ, ఆర్థోడాక్స్, బౌన్స్, స్వింగ్ ఇలా ఏ రకమైన బాల్ వేసిన రోప్ అవతలికి దాటించాడు. ఓ దశలో బాల్‌ను తీసుకురావడానికి గ్రౌండ్‌మెన్స్, లైట్ రోలర్ రైడర్లు, వాటర్ బాయ్స్ పరుగెత్తాల్సి వచ్చింది. మిడాఫ్‌లో సింగిల్‌ను ఆపేందుకు ఫీల్డర్‌ను ఉంచామని ఓ ఆఫ్ స్పిన్నర్ చెబితే అతని మీదుగా సిక్స్ కొట్టాడు. పర్ఫెక్ట్ లైన్, బ్యాట్ స్వింగ్, పాదాల కదలిక, కచ్చితమైన డిఫెన్స్‌తో బౌలర్లను ఉతికేశాడు. ఐదుసార్లు బాల్ పక్కనే ఉన్న ఎత్తైన నివాస భవనం పోర్టికోలో పడింది.
