మార్చి నుంచే రైతు భరోసా.. రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.9 వేల కోట్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మార్చి నుంచే రైతు భరోసా.. రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.9 వేల కోట్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు
  • తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని వెల్లడి

కోల్ బెల్ట్/కోటపల్లి: రైతు భరోసా నిధులు మార్చి నుంచే ఇవ్వనున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మొత్తం రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ గా మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్ పాపిరెడ్డి, మరికొందరు డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు నెలల్లో మొత్తం రైతు భరోసా ఇవ్వనున్నట్లు వి వరించారు. మార్చి నెలలో రూ.4,500 కోట్లు, మిగితావి ఏప్రిల్ లో ఇస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం సన్నబియ్యం పంపిణి చేస్తున్నా మని, సన్నవడ్లు పండించే 90 శాతం రైతులకు బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల ప్రయో జనాల కోసం సర్కార్ కట్టుబడి పనిచేస్తుందన్నా రు. రైతుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషిచేయాలన్నారు. 

ధాన్యం కొనుగోలుకు అవ సరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. డీసీఎంఎస్, ఐకేపీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీదేనని చెప్పారు. కేంద్ర మాజీ  మంత్రి కాకా వెంకట స్వామి ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు కోసం కృషి చేశారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజె క్టు కోసం రూ.11 వేల కోట్లను ఖర్చు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకు వచ్చిందన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రా జెక్టులో కాళేశ్వరం బ్యాక్వాటర్ వల్ల నియోజక వర్గ రైతుల పంటలు మునిగిపోయి నష్టపోయారన్నారు.