బాసరలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. బస్సులో 34 మంది ప్రయాణికులు.. 

బాసరలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. బస్సులో 34 మంది ప్రయాణికులు.. 

నిర్మల్ జిల్లా బాసరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ( మార్చి 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..బాసరలోని శివాజీ చౌక్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలవ్వగా..  ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు నిజామాబాద్ నుంచి బైంసా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. జనగామ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చిప్పలూర్ మండలం కరుణాపురం దగ్గర నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారు గుగులోతు దాసు, కమలమ్మగా గుర్తించారు పోలీసులు.. హనుమకొండకు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.