హార్మూజ్లో ఇరాన్ సీమైన్లు! కీలక జలసంధిపై బాంబుల వల.. మృత్యుమార్గంలా 'క్రూడ్' రూట్

హార్మూజ్లో ఇరాన్ సీమైన్లు! కీలక జలసంధిపై బాంబుల వల.. మృత్యుమార్గంలా 'క్రూడ్' రూట్
  • అమెరికా మిత్రదేశాలు అడుగు పెట్టగానే పేలిపోయేలా ప్లాన్
  • సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ప్రతిఘటన 
  • ప్రపంచ క్రూడ్ ఆయిల్ రవాణాలో ఐదో వంతు ఈ మార్గం నుంచే 
  • మైన్లు తొలగించకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్న ట్రంప్


వాషింగ్టన్ డీసీ: ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గంగా భావించే హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సీ మైన్లు అమర్చడం ప్రారంభించినట్లు అమెరికా గూఢచారి వర్గాలు వెల్లడించాయి. అమెరికాఇజ్రాయెల్ దాడులు పెరిగేకొద్దీ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు ఇరాన్ నుంచి ప్రతిఘటన తీవ్రమవుతోంది. తన అధీనంలో ఉన్న హర్మూజ్ జలసంధిని శత్రునౌకల పాలిట మృత్యుమార్గంగా మార్చే స్తోంది. 

ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని డజన్ల మైన్లు అమర్చినట్లు సమాచారం. అయితే ఇరాన్ వద్ద ఇంకా 80 నుంచి 90 శాతం వరకు చిన్న పడవలు, మైన్లు అమర్చే సామర్థ్యంతో ఉన్న నౌకలు మిగిలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే వందల సంఖ్యలో మైన్లు అమర్చే సామర్థ్యం ఇరాన్ కు ఉందని పేర్కొన్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆధ్వర్యంలో మైన్లు అమర్చే పడవలు, పేలుడు పదార్థాలతో నిండిన బోట్లు, తీరప్రాంత మిసైల్ వ్యవస్థలను వినియోగించే సామర్థ్యం ఉందనిని వేదికలు సూచిస్తున్నాయి. 

►ALSO READ | గుజరాత్ పోర్టుకు వస్తున్న కార్గో షిప్పై ప్రొజెక్టైల్స్తో దాడి.. ఓడలో 23 మంది సిబ్బంది

హార్ముజ్ జలసంధిలో మైన్లు అమర్చినట్లయితే వెంటనే తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే ఎప్పుడూ చూడని స్థాయిలో పరిణామాలు ఎదురపుతాయని తెలిపారు. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ హార్ముజ్ జలసంధి సమీపంలో మైన్లు అమర్చేం దుకు ఉపయోగిస్తున్న ఇరాన్ నౌకలను లక్ష్యం గా చేసుకుని దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల్లో మైన్లు అమర్చే 16 నౌకలు సహా పలువురు నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 

యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధి మార్గం దాదాపు మూసివేయబడిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం మూసుకుపోవడంతో గల్ఫ్ ప్రాంతంలో రోజుకు దాదాపు 15 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్, మరో 4.5 మిలియన్ బ్యారెల్ల శుద్ధి చేసిన ఇంధనం రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా మార్పులు చూపుతున్నాయి. బ్యారెల్ ధర ఒక దశలో 90 డాలర్లకు పైగా పెరిగి, మరో దశలో 80 డాలర్ల కన్నా దిగువకు పడిపోవడం గమనార్హం.