హార్మూజ్ జలసంధి దగ్గర మరో భారీ పేలుడు జరిగింది. బుధవారం (మార్చి 11) జలసంధిని దాటుకుంటూ గుజరాత్ ఓడరేవుకు బయలుదేరిన భారీ కార్గో నౌక పేలిపోయింది. సడెన్ గా రెండు ప్రొజెక్టైల్స్ తో దాడి చేయడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. నౌకలో ఉన్న 20 మంది సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. మరో ముగ్గురు చిక్కుకున్నట్లు థాయి మీడియా వెల్లడించింది.
మయూరీ నారీ అనే నౌక ప్రమాదానికి గురైంది. ఒమన్ తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో.. నౌకలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు మెరీటైమ్ సిబ్బంది పేర్కొంది. ఘటన జరిగిన తర్వాత 20 మందిని కాపాడామని.. మరో ముగ్గురు నౌకలోనే ఉండిపోయారని థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
కార్గో నౌకను రెండు ప్రొజెక్టైల్స్ దాడి చేయడంతో ప్రమాదం జరిగినట్లు రాయల్ థాయి నేవీ, యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ కు చెందిన సిబ్బంది పేర్కొన్నాయి. థాయిలాండ్ దేశానికి చెందిన నౌక.. గుజరాత్ తీరానికి వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది. బుధవారం యూఏఋ లోని ఖలీఫా పోర్టు నుంచి బయల్దేరిన నౌక.. గుజరాత్ రేవు వైపు వస్తుండగా.. ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.
హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రూడ్, గ్యాస్ ఇతర ఏ రవాణా అక్కణ్నుంచి జరగటం కష్టంగా మారింది. దీంతో చాలా దేశాలు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ కొరతతో ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో యూఏఈ నుంచి బయల్దేరిన థాయిలాండ్ కార్గో షిప్ దాడికి గురికావడం ఆందోళన కలిగించే అంశం. అయితే ఈ దాడి ఎవరు చేశారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఏ దేశం కూడా ఇది తమ పనేనని ప్రకటించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
